Ballerina Final Trailer: అనా డి అర్మాస్.. బాలేరినా ఫైనల్ ట్రైలర్ వచ్చేసింది.
ABN, Publish Date - May 14 , 2025 | 06:55 AM
ప్రపంచవ్యాప్తంగా జాన్ విక్ సినిమాలకు ఉండే ఆదరణే ప్రత్యేకం. ఇప్పుడు ఈ సిరీస్‌లో వస్తోన్న కొత్త చిత్రం బాలేరినా విడుదలకు సిద్ధమైంది.
ప్రపంచవ్యాప్తంగా జాన్ విక్ సినిమాలకు ఉండే ఆదరణే ప్రత్యేకం. ఇప్పుడు వస్తున్న ఔట్ అండ్ ఔట్ వయలెన్స్ సినిమాలన్నింటికీ ఆ చిత్రమే మూలం అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే నాలుగు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం ఒకదాన్ని మించి మరోటి విజయం సాధించాయి. హీరో కీను రీవ్స్ (Keanu Reeves)ను ఓవర్‌పైట్ ఇంటర్నేషనల్ స్టార్‌ను సైతం చేశాయి.
ప్రస్తుతం ఈ సిరీస్‌లో 5వ చిత్రం కోసం ప్రయత్నాలు జరుగుతుండగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర అయినా బాలేరినా క్యారెక్టర్‌ను స్టాండ్ ఎలోన్ సినిమాగా మారుస్తూ ఓ కొత్త యాక్షన్ సినిమా రూపొందించారు. దానికి బాలేరినా (Ballerina) ఫ్రం ది వరల్డ్ ఆఫ్ జాన్ విక్ (From the World of John Wick: Ballerina) అంటూ ప్రచారం సైతం చేశారు.
కుర్రకారు కలల రాణి, విశ్వ వ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న అనా డి అర్మాస్ (Ana de Armas) ఈ బాలేరినా (Ballerina) మూవీ టైటిల్ క్యారెక్టర్‌లో నటించగా అంజెలికా హస్టన్, గాబ్రియేల్ బైర్నే, లాన్స్ రెడ్డిక్, కాటాలినా శాండినో మోరెనో, నార్మన్ రీడస్, ఇయాన్ మెక్‌షేన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కీను రీవ్స్ (Keanu Reeves)సైతం ఓ రోల్‌లో కనిపించనున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదల చేసిన టీజర్లు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. జూన్6న ప్రపంచ వ్యాప్తంగా అయా భాషలలోనూ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ మంగళవారం ఈ చిత్ర ఫైనల్ ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ సైతం జాన్ విక్ సినిమా తరహాలోనే ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇంకెఎందుకు ఆలస్యం ఇప్పుడే చూసేయండి మరి.