Karate Kid: Legends: జాకీచాన్ చిత్రం.. అజయ్ దేవగన్ వార‌సుడు ఎంట్రీ

ABN , Publish Date - May 13 , 2025 | 07:21 PM

ఓ హాలీవుడ్ సూప‌ర్‌హిట్ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించిన ‘కరాటే కిడ్: లెజెండ్స్’ సినిమాకు బాలీవుడ్‌లో ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌డింది.

ajay

ప‌దేహేనేండ్ల‌ త‌ర్వాత ఓ హాలీవుడ్ సూప‌ర్‌హిట్ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందించిన ‘కరాటే కిడ్: లెజెండ్స్’ (Karate Kid: Legends) విడుద‌ల‌కు రెడీ అయింది. ఈ నెలాఖ‌రున ఈ సినిమా థియేట‌ర్ల‌కు రానుండ‌గా ఇప్ప‌టికే ఈ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఇప్ప‌టికే అంత‌టా జోరుగా సాగుతున్నాయి. కొలంబియా పిక్చ‌ర్స్ (Columbia Pictures) నిర్మించిన ఈ సినిమాలో జాకీ చాన్ (Jackie Chan), యుగ్ బెన్ వాంగ్ (Ben Wang), రాల్ఫ్ మచియో (Ralph Macchio) కీల‌క పాత్ర‌లు పోషించారు. జోనాథన్ ఎంట్విస్ట్లే (Jonathan Entwistle) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా మే 30న దేశవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

అయితే.. ఈ సినిమాకు బాలీవుడ్‌లో ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌డింది. సూప‌ర్ స్టార్ అజ‌య్ వేవ్‌గ‌ణ్ (Ajay Devgn) ఈ సినిమాలో జాకీచాన్ (Jackie Chan) పాత్ర‌కు హిందీలో డ‌బ్బింగ్ చెప్ప‌గా ఆయ‌న కుమారుడు యుగ్ వేవ్‌గ‌ణ్ (Yug Devgan) సినిమాలో హీరో పాత్ర అయిన కథానాయకుడు లీ ఫాంగ్ పాత్రకు డ‌బ్బింగ్ చెప్ప‌డం విశేషం.దీంతో యుగ్‌ ఫ‌స్ట్ టైం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన‌ట్లైంది. అంతేకాదు అజ‌య్ దేవ‌గ‌ణ్ త‌న టోట‌ల్ సినీ కెరీర్‌లోనే ఫ‌స్ట్ టైం ఓ అంత‌ర్జాతీయ సినిమాకు డ‌బ్బింగ్ చెప్ప‌డమేకాక తండ్రీ కోడుకులు క‌లిసి ఓ చిత్రానికి వాయిస్ ఇవ్వ‌డం ఇప్పుడు ప్రాధాన్యం సంత‌రించుకుంది. అంతేకాదు ఒక్కసారిగా ఈ ‘కరాటే కిడ్: లెజెండ్స్’ (Karate Kid: Legends) చిత్రంపై హిందీలో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

Gq0aeQLXMAAWWGt.jpg

ఇదిలాఉంటే గ‌తంలో రెండు ప‌ర్యాయాలు షారుఖ్ ఖాన్‌, అత‌ని కుమారులు మూడు నాలుగు హాలీవుడ్ చిత్రాల‌కు డ‌బ్బింగ్ చెప్ప‌గా మ‌ళ్లీ చాలా రోజుల త‌ర్వాత బాలీవుడ్ నుంచి అజ‌య్ దేవ‌గ‌ణ్ వంటి ఓ స్టార్ హీరో చెప్పారు. ఇక తెలుగులో డిస్నీ ప్రోజెన్ యానిమేష‌న్ సినిమాకు టాలీవుడ్ స్టార్ మ‌హేశ్‌బాబు గారాల ప‌ట్టి సితార వాయిస్ అందించ‌గా ఇటీవ‌ల మ‌హేశ్ బాబు ముఫాసా సినిమాలో డ‌బ్బింగ్ చెప్పారు. వీరితో పాటు నిత్యా మ‌న‌న్, నాని, అయ్య‌ప్ప పీ శ‌ర్మ‌, జ‌గ‌ప‌తి బాబు, బ్ర‌హ్మ‌నందం, అలీ కూడా హాలీవుడ్ సినిమాల‌కు తెలుగులో డ‌బ్బింగ్ చెప్పిన వారి జాబితాలో ఉన్నారు.

Updated Date - May 13 , 2025 | 07:21 PM