Kantara Chapter1: కాంతార చాఫ్టర్1 ట్విట్టర్ రివ్యూ .. సినిమా ఎలా ఉందంటే?
ABN , Publish Date - Oct 02 , 2025 | 07:21 AM
ఎన్నో అంచనాల నుడుమ గురువారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకు వచ్చింది రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన కాంతార చాఫ్టర్.
ఎన్నో అంచనాల నుడుమ గురువారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకు వచ్చింది రిషబ్‌శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో నటించిన కాంతార చాఫ్టర్1 (Kantara Chapter1). బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య ప్రతి నాయకుడిగా నటించగా రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించింది. ఇప్పటికే ఈ సినిమి చాలా ప్రాంతాలలో ప్రీమాయర్స్ పడగా అనేక మంది చూసి ట్విట్టర్ ఎక్స్ ఇతర ఫ్లాట్‌ఫాంల ద్వారా తమ అభిఫ్రాయాలను వెలిబుచ్చుతున్నారు. మరి వారేం అనుకుంటున్నారో ఒకసారి చూద్దాం రండి.
‘కాంతారా చాప్టర్ 1’ మొదటి భాగం ముగిసిన దగ్గరనుండే పికప్ అవుతుందని.. కథను వెనక్కి తీసుకెళ్లి, పూర్వచరిత్రను బలంగా ఎస్టాబ్లిష్ చేశారని అంటున్నారు. ఫస్టాప్, సెకండాఫ్‌లలో అక్కడక్కడ లాగ్ అనిపించే సన్నివేశాలు ఉన్నా..మధ్యలో ఇంట్రెస్టింగ్ సీన్లు పెట్టుకున్నారని, ఫ్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు వచ్చే సీన్లు అదిరిపోయాయని అంటున్నారు. తొలి చిత్రం లాగానే ఇందులోనూ సెకండాఫ్ సినిమా నిల బెడుతుందని అందుకు సంబంధించి ఫొటోలు పెడుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇది తప్పక థియేటర్‌లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా అని పోస్టులు పెడుతున్నారు.
వీఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ టాప్ నాచ్‌గా ఉందని, మ్యూజిక్ మరోసారి సినిమాకి పెద్ద అసెట్‌గా నిలిచిందని. ముఖ్యమైన సన్నివేశాలను మ్యూజిక్ ఎలివేట్ చేసేలా ఉందని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా రిషబ్ శెట్టి మరోసారి అద్భుతమైన నటనను చూపించారని ఇంకా చెప్పాలంటే మొదటి భాగాన్ని మించి చేశారని కూడా చెప్పొచ్చు. రుక్మిణి వసంత్‌కి మంచి రోల్ పడిందని ఆమె దాన్ని బాగా చేసిందని పోస్టులు పెడుతున్నారు. ఓ అడుగు ముందుకేసి ఇండియన్ సినిమాలలోనే ది బెస్ట్ క్లైమాక్స్ అని ఆకాశానికెత్తుస్తున్నారు. ప్రతీ ఏరియా నుంచి బ్లాక్బస్టర్ రెస్పాన్స్, రివ్యూస్‌నే అందుకుంటుంది.