Predator Badlands Review: ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్.. హాలీవుడ్ మూవీ ట్విట్టర్ రివ్యూ
ABN , Publish Date - Nov 07 , 2025 | 09:29 PM
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించేందుకు హాలీవుడ్ నుంచి ‘ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్’ సినిమా శుక్రవారం థియేటర్లకు వచ్చి ఇండియన్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించేందుకు హాలీవుడ్ నుంచి ‘ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్’ (Predator Badlands) సినిమా శుక్రవారం థియేటర్లకు వచ్చి మన ఇండియన్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతోంది. “ఇది మన ఇండియన్ స్టైల్‌లో యాక్షన్ సీన్లతో సినిమా అదిరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు.
యాక్షన్ సీన్స్ ఘనంగా, విజువల్స్ సూపర్‌గా, థ్రిల్ ఒక్క సీన్ కూడా తగ్గకుండా ఉందంటూ రివ్యూల్లో పొగడ్తల వర్షం కురుస్తోంది. జెన్నా అనే గ్రహం మీద ప్రెడేటర్‌తో డెక్ చేసే ఫైట్లు, కొత్తగా డిజైన్ చేసిన యుద్ధ సన్నివేశాలు థియేటర్‌లో చూడటానికి పండుగలా ఉన్నాయంటున్నారు.
ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు, ఎమోషన్ కూడా బలంగా ఉంది. డెక్ తన తండ్రి అప్రూవల్ కోసం, తమ్ముడు క్వేయ్ కోసం చేసే ఫైట్, ఆ ఫ్యామిలీ టచ్, రివెంజ్ యాంగిల్, ఎమోషనల్ డైలాగులు మన ఆడియన్స్‌కి సులభంగా కనెక్ట్ అయ్యేలా, ఎక్కడా ఒంక పెట్టని విధంగా ఉన్నాయని అంటున్నారు.

డెక్‌కి సపోర్ట్‌గా ఉన్న టాకేటివ్ సింథెటిక్ థియా, చిన్న ఏలియన్ బడ్‌తో వచ్చే కామెడీ ట్రాక్ కూడా బాగానే నడుస్తోంది. ఈ ముగ్గురి మధ్య కెమిస్ట్రీ సినిమాకి కొత్త ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చిందని చెబుతున్నారు. ముఖయంగా యాక్షన్ సన్నివేశాలు ఒకదాన్ని మించి మరోటి ఉండి చూసే వారిని సీటులో కూర్చోనివడం లేదని, అలాగే వింత వింత జంతువులు వాటిలో ఫ్రిడేటర్ పోరాటాలు అన్ని గూస్‌బమ్స్ తెప్పించేలా ఉన్నామని పొగడ్తలు కురిపిస్తున్నారు.
మొత్తానికి, ‘ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్’ సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఇండియన్ మసాలాని కలిపినట్లు పర్ఫెక్ట్ ఎంటర్టైనర్‌గా ఉందని ట్వీట్లు చేస్తున్నారు. యాక్షన్, ఎమోషన్, హ్యూమర్ అన్నీ సరిగ్గా మిక్స్ అయి, థియేటర్‌లో పక్కా పైసా వసూల్ ఫీలింగ్ ఇస్తుందని జనం అంటున్నారు. ఈ సినిమాను పిల్లలు, పెద్దలు ఇంటిల్లిపాది కలిసి చూసేయ వచ్చని ఎక్కడా అసభ్యత, హింసాత్మక సీన్లు లేకుండా విజువల్ వండర్‌గా ‘ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్’ (Predator Badlands) సినిమా ఉందని తేల్చేస్తున్నారు.