Kuberaa Review: నాగార్జున, ధనుష్.. కుబేరా ఎలా ఉందంటే! ట్విట్టర్ రివ్యూ
ABN , Publish Date - Jun 20 , 2025 | 06:55 AM
ఎన్నో అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా నేడు (శుక్రవారం 20 జూన్)న ప్రేక్షకుల ఎదుటకు వచ్చింది కుబేర.
నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక (Rashmika Mandanna) కాంబినేషన్‌లో రూపొందిన సౌత్ ఇండియా మోస్ట్ ఏవైటెడ్ మూవీ కుబేర (Kuberaa). ఎన్నో అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా నేడు (శుక్రవారం 20 జూన్)న ప్రేక్షకుల ఎదుటకు వచ్చింది. ఇప్పటికే విదేశాలలో ఈ చిత్రం ప్రదర్శితం అవగా మరికొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ వేశారు. దీంతో సినిమా చూసిన వారంతా ఎలా ఉందో చెబుతూ తమ అనుభవాలను, ఎలా అనిపించిందనే అంశాలను పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. మరి వారి రివ్యూలు ఎలా ఉన్నాయో చూద్దాం.
శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఈ సినిమాపై వీక్షకులు తమ అభిప్రాయాలు పంచుకుంటుండగా చాలామంది సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఫస్టాప్ మైండ్ బ్లోయింగ్‌గా ఉందని, ముఖ్యంగా ధనుష్ ఎంట్రీ తర్వాత మూవీ అదిరిపోయిందని పోస్టులు పెడుతున్నారు. ధనుష్ తప్ప మరెవరూ ఈ పాత్ర చేయలేరని, మరోసారి నేషనల్ అవార్డ్ రావడం పక్కా అంటూ చాలామంది కామెంట్స్ సైతం చేస్తున్నారు. ఇక నాగార్జున రోల్ కూడా ఊహించని విధంగా ఎక్ట్స్రార్డినరీగా ఉందని క్యారెక్టర్ ఫర్‌పక్ట్‌గా సూట్ అయిందని అంటున్నారు. రష్మికకు కూడా గత శేఖర్ కమ్ముల సినిమాలలోని పాత్రల లాగానే మంచి పాత్ర పడిందని తన కెరీర్ బెస్ట్ ఇచ్చిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఫస్టాప్ కన్నా సెకండాఫ్ అది కూడా ఫ్రీ క్లైమాక్స్‌లో కాస్త లాగ్ అనిపించిందని, అదేవిధంగా మూవీ రన్ టైం మినహా సినిమా అద్భుతంగా ఉందని, శేఖర్ కమ్ముల తన స్టామినాను నిరూపించుకున్నాడని, తను ఎందుకు ప్రత్యేకమో ఈ చిత్రంతో మరోమారు చాటి చెప్పాడని అంటున్నారు. ప్రధానంగా మూవీ కథ, డైలాగ్స్, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయని పేర్కొంటున్నారు. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషన్ సీన్లు సినిమాకు ప్రాణమని ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమని తెలుపుతూ అనేక మంది 3 నుంచి 4.5 పాయింట్ల వరకు రేటింగ్ ఇస్తూ కుబేర (Kuberaa) బ్లాక్‌బస్టర్ అని తేల్చేస్తున్నారు.