Superman Review: సూపర్ మ్యాన్ ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ
ABN , Publish Date - Jul 11 , 2025 | 07:15 AM
విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది ఎదురు చూస్తున్న హాలీవుడ్ చిత్రం సూపర్‌మ్యాన్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న భారీ హాలీవుడ్ చిత్రం సూపర్‌మ్యాన్: లెగసీ (Superman) శుక్రవారం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే చాలా దేశాల్లో పెయిడ్ ప్రీమియర్స్, నైట్ షోలు పడగా మన దేశంలోనూ చాలా ప్రాంతాలలో షోలు పడిపోయాయి. ఓ బాలీవుడ్, టాలీవుడ్ స్ట్రెయిట్ భారీ చిత్రం థియేటర్‌కు వచ్చిందా అనే రేంజ్‌లో 1000కి పైగా థియేటర్లలో విడుదలై ఇండియన్ బాక్సాపీసును షాక్ గురి చేస్తోంది. ఈ సినిమా నుంచి డేవిడ్ కోరెన్‌స్వెట్ (David Corenswet) కొత్త సూపర్‌మ్యాన్‌గా కనపడనుండగా రాచెల్ బ్రాస్నహన్, నికోలస్ హౌల్ట్ కీలక పాత్రల్లో నటించారు. గతంలో భారీ విజయవంతమైన చిత్రాలు సూసైడ్ స్క్వౌడ్, గార్డియన్స్ ఆఫ్ ది గెలక్సీ సినిమాలను తెరకెక్కించిన జేమ్స్ గన్ (James Gunn) ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. మరైతే ఇప్పటికే ఈ చిత్రం చూసిన వారు ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారో, ఇచ్చారో, వారి అభిప్రాయాలేంటో ఇక్కడ చూద్దాం.
ఆరంభమే.. ఓ మిషన్‌లో పాల్గొని బాగా దెబ్బతిని పడి ఉన్న సూపర్ మ్యాన్‌ను చూయిస్తూ ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. లూథర్ అనే వ్యక్తి ఎలాగైనా సూపర్ మ్యాన్‌కు ప్రజల్లో ఉన్న మంచి గుర్తింపును, ఫాలోయింగ్‌ను పూర్తిగా డిస్ట్రాయ్ చేసి అతన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసి అనేక కుట్రలతో ఓ వీడియో రిలీజ్ చేస్తాడు. దాంతో సూపర్‌మ్యాన్‌కు అంతటా చెడ్డ పేరు వస్తుంది. జనంలో తిరగలేని పరిస్థి ఏర్పడుతుంది. అదే సమయంలోప్రపంచాన్ని నాశనం చేసే శక్తలు రంగంలోకి దిగుతాయి. అందులో సూపర్ పవర్స్ ఉన్న విలన్ లవర్ సైతం ఉంటుంది. ఈ నేపథ్యంలో హీరో కోల్పోయిన తన పరువుని తిరిగి ఎలా సంపాదించుకున్నాడు, ఆ స్ట్రాంగ్ విలన్లను ఎలా అడ్డుకున్నాడనే పాయింట్‌తో సినిమా సాగుతుంది.
అయితే.. ఈ సినిమా ఇప్పటివరకు వచ్చిన అన్ని సూపర్ మ్యాన్ మ్యాన్ చిత్రాలను మించి ఉందని, ఎక్కడా తప్పు పట్టడానికి, వేలెత్తి చూపడానికి అస్కారం లేకుండా ఉందని ఘంటాపథంగా చెబుతున్నారు. చాలా రోజుల తర్వాత అదిరిపోయే సూపర్ హీరో మూవీ వచ్చిందని, ఎక్కడా డిస్సపాయింట్ చేయదని, ఇంటిల్లి పాది కలిసి సినిమాను చూసేయవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా విలన్‌తో వచ్చే మొదటి సన్నివేశం, ఆపై హీరోయిన్‌తో రొమాన్స్, గొడవ సాన్లు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటాయని వారి పాత్రలు హైలెట్‌గా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు. అదేవిధంగా హీరో కుక్క క్రిప్టో సైతం మంచి మార్కులు కొట్టేస్తుందని పిల్లు బాగా ఇష్ట పడతారని అంటున్నారు.
ఇక అన్నింటికి మించి విజువల్ ఎఫెక్ట్స్ మోస్ట్ అడ్వాన్స్‌గా, అద్బుతంగా ఉన్నాయని, ఇటీవల ఇంత ఫర్ ఫెక్ట్ గ్రాఫిక్స్ చూడలేదని, కలర్ కరెక్షన్ కూడా బాగా సెట్టయిందని అంటున్నారు. అంతేగాక హక్ గర్ల్, మిస్టర్ టెర్రఫిక్, గై గార్డన్ పాత్రలు ఆకట్టుకుంటాయని, మధ్యలో వచ్చే జస్టిస్ లీగ్ మెంబర్స్, సర్‌ఫ్రైజ్ క్యామియోస్ మంచి ఎనర్జీ ఇస్తామని పోస్టులు పెడుతున్నారు. యాక్షన్ సన్నివేశాలు, వాటిని చిత్రీకరించిన విధానం నభూతో అన్న రీతిలో ఉన్నాయని, కేవలం యాక్షన్ ప్రియులే కాకుండా ఫ్యామిలీ అంతా కలిసి మిస్ అవకుండా చూడాల్సిన సినిమా అని ఈ మధ్య ఇంత మంచి సినిమా రాలేని చూస్తే స్టన్ అవుతారంటూ సూపర్‌మ్యాన్: లెగసీ (Superman) సినిమాను ఆకాశానికెత్తేస్తూ చాలామంది ట్వీట్లు చేస్తున్నారు.