Marana Mass OTT Review: ఓటీటీకి వచ్చేసిన.. బసిల్ జోసెఫ్ వెరైటీ డార్క్ కామెడీ థ్రిల్లర్! ఎలా ఉందంటే
ABN , Publish Date - May 15 , 2025 | 05:00 PM
నెల రోజుల క్రితం మలయాళంలో థియేటర్లలో విడుదలై మిక్సడ్ టాక్ తెచ్చుకుని రూ.20 కోట్లు కలెక్ట్ చేసిన బసిల్ జోసెఫ్ నటించిన డార్క్ కామెడీ థ్రిల్లర్ చిత్రం మరణ మాస్ ఓటీటీకి వచ్చేసింది.
సరిగ్గా నెల రోజుల క్రితం మలయాళంలో థియేటర్లలో విడుదలై మిక్సడ్ టాక్ తెచ్చుకుని రూ.20 కోట్లు కలెక్ట్ చేసిన డార్క్ కామెడీ థ్రిల్లర్ చిత్రం మరణ మాస్ (Marana Mass). వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న బసిల్ జోసెఫ్ (Basil Joseph) హీరో. ఇప్పటికే ఈ సంవత్సరం ప్రవింకూడు షప్పు (Pravinkoodu Shappu), పొన్‌మ్యాన్ (Ponman) వంటి రెండు వైవిధ్యభరిత చిత్రాలతో మెప్పించిన బసిల్ జోసెఫ్ ఈ చిత్రంలో మరో కొత్త పాత్రలో కనిపించడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.మలయాళ అగ్ర హీరో టొవినో థామస్ (Tovino Thomas) నిర్మించిన ఈ మూవీలో రాజేష్ మాధవన్, అనిష్మా అనిల్ కుమార్, సురేష్ కృష్ణ, సిజు సన్నీ, బాబు ఆంటోని కీలక పాత్రల్లో నటించగా శివప్రసాద్ దర్శకత్వం వహించాడు.
ఇక కథ విషయానికి వస్తే.. కేరళలోని ఓ విలేజ్‌లో ఓ వ్యక్తి ఊర్లో వయసు మళ్లిన వారిని చంపి వారి నోట్లో ఆరటి పండు పెట్టి వదిలేసి పోతుంటాడు. దీంతో ఆ ఊర్లో భయాందోళనలు ఉంటాయి. మరోవైపు పోలీసులు హంతకుడి కోసం వెతికే పనిలో ఉంటూ అతనికి బనానా కిల్లర్ అని పేరు పెపడతారు. మరోవైపు హీరో (లూక్) చేసే పనుల వళ్ల ఆ ఊరు జనం విసుగు చెంది తలా కొంత డబ్బు జమ చేసి లూక్‌ను విదేశాలకు పంపాలని అన్ని సిద్ధం చేసి ఫ్లైట్ టికెట్ సైతం బుక్ చేసి ఉంచుతారు. అదే సమయంలో లూక్‌కు లవర్ బ్రేకప్ చెబుతుంది.
అయితే ఓ రాత్రి లుక్ లవర్ బస్సులో వెళ్తుండగా ఓ కొంటె వృద్దుడు అసభ్యంగా ప్రవర్తిచంగా తన దగ్గర ఉన్న పెప్పర్ స్ప్రే చేస్తుంది. దాంతో ఆ ముసలి వ్యక్తి మరణిస్తాడు. ఆ సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో పాటు అసలు సీరియల్ కిల్లర్ కూడా ఉంటాడు. కాసేపటికి లూక్ ఆ బస్సులోకి వస్తాడు. వారంతా కలిసి డెడ్ బాడీని ఎవరికి తెలియక ముందే అక్కడి నుంచి మాయం చేయాలని స్మశానికి తీసుకెళతారు. కానీ అక్కడ చనిపోయిన ముసలి వ్యక్తి తన చిన్నప్పుడు తప్పిపోయిన తండ్రి అని బస్సు కండక్టర్ గుర్తించి అక్కడ పూడ్చడానికి ఒప్పుకోడు. తిరిగి మరో ప్రాంతానికి బయలుదేరుతారు.
కానీ నిమిషనిమిషానికి పరిస్థితులు చేజారుతుండడంతో అసలు సీరియల్ కిల్లర్ బస్సులోనే ఉన్నాడని గుర్తించే సమయానికి ఆ కిల్లర్ ఆ డెడ్‌బాడీతో వారికి చెప్పకుండా వెళ్లిపోతాడు. ఆ డెడ్ బాడీకి హీరో షర్టు ఉండడంతో ఎక్కడ దొరికిపోతామోనని ఆ కిల్లర్ కోసం వెతుకుతుంటారు, మరోవైపు హీరోనే కిల్లర్ అంటూ ప్రకటించి పట్టిస్తే 10 లక్షలు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో చాలామంది హీరో కోసం వెతుకుతూ ఉంటారు. ఈక్రమంలో హీరో గ్యాంగ్ సీరియల్ కిల్లర్‌ను పట్టుకుందా, ఆ కిల్లర్ డెడ్‌బాడీని ఎందుకు కిడ్నాప్ చేశాడు, పోలీసులు ఏం చేశారనే ఆసక్తికరమైన కథకథనాలతో సాగుతుంది. సినిమాలో ఎక్కడా అసభ్యత, అశ్లీలత ఎక్కడా లేవు ఇంటిల్లిపాది హాయిగా కలిసి చూసేయవచ్చు. ఓ ఐదారు పాత్రల చుట్టూనే సినిమా తిరుగుతూ ఆకట్టుకుంటుంది. అక్కడక్కడ బాగా లాగ్ చేసినా ఓ వైరైటీ సినిమా చూసిన ఫీలింగ్ ప్రతి ఒక్కరికీ వస్తుంది.
అయితే.. చాలామందికి సినిమా ఎక్కడ కష్టమే. మలయాళీలకు తగ్గట్టుగా వారికి నచ్చేవిధంగా, అక్కడి సామాజిక పరిస్తితులపై అవగాహాన ఉన్నవారికి సినిమా బాగా అర్ధమయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పోలీసాఫీసర్ ఇంట్రడక్షన్ సీన్‌లో ఓ లెవల్‌లో బిల్డప్ ఇచ్చి చివరకు తన కుక్క తప్పిపోయిందని ఏడ్చే సీన్ సినిమాకే హైలెట్. ఇక హీరో, విలన్, పోలీస్ ఆఫీసర్ల క్యారెక్టర్ల ఎంపిక కూడా అలానే ఉంటుంది. సునిశిత హాస్యం ఉంటూనే దాని వెనకాల మరెవరినో రోస్టింగ్ చేసినట్లు ఉంటుంది. ఈ సినిమా ఇప్పుడు సోనీ లివ్ (Sony Liv) ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు ఇతర దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. కాస్త డిఫరెంట్ సినిమా చూడాలనుకునే వారు ఈ వెకెండ్ మీ వాచ్ లిస్టులో ఈ ఈ మరణ మాస్ (Marana Mass) చిత్రం పెట్టుకోవచ్చు.
మరణ మాస్.. జస్ట్ టైంఫాస్
రివ్యూ అండ్ రేటింగ్: 2.75/ 5