నిర్మాణరంగంలోకి హీరో యశ్‌ మాతృమూర్తి

ABN, Publish Date - May 22 , 2025 | 05:55 AM

కన్నడ హీరోగా కెరీర్‌ ప్రారంభించి పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగిన యశ్‌ ప్రస్తుతం ‘రామాయణ’ చిత్రంలో రావణుడిగా నటిస్తున్న సంగతి విదితమే. ఆయన మాతృమూర్తి...

కన్నడ హీరోగా కెరీర్‌ ప్రారంభించి పాన్‌ ఇండియా స్థాయికి ఎదిగిన యశ్‌ ప్రస్తుతం ‘రామాయణ’ చిత్రంలో రావణుడిగా నటిస్తున్న సంగతి విదితమే. ఆయన మాతృమూర్తి పుష్ఫ అరుణ్‌కుమార్‌ ఇప్పుడు నిర్మాతగా మారారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడం కోసం ఆవిడ చిత్ర నిర్మాణసంస్థను ఏర్పాటు చేసి ‘కొత్తలవాడి’ చిత్రం తీస్తున్నారు. పృథ్వీ అంచార్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సిరాజ్‌ దర్శకుడు. ఈ సినిమా పై ఉన్న అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్‌ బుధవారం టీజర్‌ విడుదల చేశారు. మాస్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ టీజర్‌ ఆకట్టుకుంటోంది.

Updated Date - May 22 , 2025 | 05:55 AM