Jagadish Amanchi Film: మైథలాజికల్ థ్రిల్లర్
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:17 AM
జగదీశ్ ఆమంచి నటించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘యముడు' మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రం. సిటీలో అమ్మాయిల అపహరణలు, హత్యలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో యముడు పాత్రధారి వాటికి సంబంధించినట్లుగా కథ సాగుతోంది.
జగదీశ్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘యముడు’. శ్రావణి శెట్టి హీరోయిన్. మైథాల జీ, సస్పెన్స్, క్రైమ్ అంశాలతో రూపుదిద్దుకుంటున్న థ్రిల్లర్ ఇది. గురువారం ఈ మూవీ టీజర్‌ను హీరో నవీన్‌చంద్ర విడుదల చేశారు. సిటీలో ఉన్న అమ్మాయిలు అపహరణకు, హత్యకు గురవడం, నాటకాల్లో యముడి వేషం వేసే నటుడికీ ఆ హత్యలకు సంబంధం ఉందేమో అన్నట్లుగా ఈ టీజర్లో చూపించారు. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని అప్డేట్స్ను ప్రకటిస్తామని నిర్మాత జగదీశ్ చెప్పారు. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రజని ఆమంచి.