Yamudu: నవీన్ చంద్ర వదిలిన ‘యముడు’ టీజర్..
ABN , Publish Date - May 31 , 2025 | 09:51 AM
జగదీష్ ఆమంచి (jagadeesh amanchi) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’ (yamudu). 'ధర్మో రక్షతి రక్షితః' అనే ఉప శీర్షిక.
జగదీష్ ఆమంచి (jagadeesh amanchi) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’ (yamudu). 'ధర్మో రక్షతి రక్షితః' అనే ఉప శీర్షిక. శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రం టీజర్‌ను నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. టీజర్‌ను చూసిన అనంతరం చిత్రయూనిట్‌ను అభినందించారు.
ఇదొక మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ అని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. సిటీలో ఉన్న అమ్మాయిలు మిస్ అవుతుండటం, నాటకాల్లో యముడు వేషం వేసే వ్యక్తికి ఈ హత్యలకు సంబంధం ఉందేమో అన్నట్టుగా టీజర్‌ను కట్ చేశారు. యముడు భూలోకంకి వచ్చి నరకంలో విధించే శిక్షలన్నీ ఇక్కడే విధిస్తాడేమో అన్నట్టుగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్లను మేకర్లు ప్రకటించనున్నారు.