ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌

ABN , Publish Date - May 04 , 2025 | 03:02 AM

నాగపూర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌తో సినిమా థియేటర్‌ను నిర్మించనున్నారు. ‘వేవ్స్‌’ సమ్మిట్‌లో పాల్గొన్న తెలుగు నిర్మాతలు అభిషేక్‌ అగర్వాల్‌, విక్రమ్‌ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రకటించారు...

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో

అభిషేక్‌ అగర్వాల్‌, విక్రమ్‌ రెడ్డి

నాగపూర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌తో సినిమా థియేటర్‌ను నిర్మించనున్నారు. ‘వేవ్స్‌’ సమ్మిట్‌లో పాల్గొన్న తెలుగు నిర్మాతలు అభిషేక్‌ అగర్వాల్‌, విక్రమ్‌ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రకటించారు. ఈ సందర్భంగా అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘వరల్డ్‌ బిగ్గెస్ట్‌ సినిమా స్ర్కీన్‌ నిర్మించే అవకాశం మాకు దక్కడం గర్వంగా ఉంది.

భారత వినోదరంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనేది ప్రధాని మోదీ లక్ష్యం. ఆ దిశగా మా ప్రయత్నం మొదలైంది’ అని అన్నారు. ‘సినిమాను మరింత గొప్పగా తీర్చిదిద్దడమే మా యూవీ క్రియేషన్స్‌ లక్ష్యం. గొప్ప సినిమాలు తీయడం కాదు. అద్భుతమైన థియేటర్లు నిర్మించడమే మా ధ్యేయం’ అని మరో నిర్మాత విక్రమ్‌ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - May 04 , 2025 | 08:37 AM