డెవిల్ కథేంటి?
ABN , Publish Date - Feb 19 , 2025 | 02:37 AM
దురాశ మనిషిని ఎలా పతనం చేస్తుందనేది ప్రధానాంశంగా కుటుంబ నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ది డెవిల్స్ చైర్’. అదిరే అభి, స్వాతి మందల్ హీరో హీరోయిన్లు. గంగ సప్త శిఖర దర్శకత్వంలో కేకే చైతన్య, వెంకట్...
దురాశ మనిషిని ఎలా పతనం చేస్తుందనేది ప్రధానాంశంగా కుటుంబ నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ది డెవిల్స్ చైర్’. అదిరే అభి, స్వాతి మందల్ హీరో హీరోయిన్లు. గంగ సప్త శిఖర దర్శకత్వంలో కేకే చైతన్య, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్ర నిర్మించారు. ఈ నెల 21న ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. అదిరే అభి మాట్లాడుతూ ‘దురాశ వల్ల మనుషులు ఏమేం కోల్పోతున్నారనే అంశం చుట్టూ అల్లుకున్న కథతో ఈ చిత్రాన్ని తీశాం. కాన్సె్‌ప్టతో పాటు మంచి సందేశం ఉన్న చిత్రమిది. పతాక సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి’ అన్నారు. మంచి వినోదం పంచే చిత్రమిదని దర్శకుడు చెప్పారు. పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రమిదని నిర్మాతలు పేర్కొన్నారు.
Also Read:
నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి
మొసలికి చుక్కలు చూపించిన ఏనుగు..
2 విడతల్లో డీఏ..? భారీ పెరగనున్న పెన్షన్లు, జీతాలు..!
For More Andhra Pradesh News and Telugu News..