‘సంక్రాంతికి వస్తున్నాం’ టికెట్‌ ధరల పెంపు

ABN , Publish Date - Jan 10 , 2025 | 06:13 AM

వెంకటేష్‌ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టికెట్ల ధరలు పెంపునకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 14న విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి రోజు...

వెంకటేష్‌ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టికెట్ల ధరలు పెంపునకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 14న విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి రోజు ఆరు షోలకు, 15వ తేదీ నుంచి ఐదు ప్రదర్శనలకు అనుమతి లభించింది. మల్టీప్లెక్స్‌లలో అదనంగా రూ.125, సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లలో రూ.100 పెంచుకోవచ్చని రాష్ట్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ్ఝ

అమరావతి, ఆంధ్రజ్యోతి

Updated Date - Jan 10 , 2025 | 06:13 AM