పెద్ద హిట్‌ కొట్టబోతున్నాం

ABN, Publish Date - Feb 18 , 2025 | 01:12 AM

సందీప్‌ కిషన్‌, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’. ‘మన్మథుడు’ ఫేమ్‌ అన్షు, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషించారు. త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్‌ దండా నిర్మించారు. ఈ నెల 26న...

సందీప్‌ కిషన్‌, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘మజాకా’. ‘మన్మథుడు’ ఫేమ్‌ అన్షు, రావు రమేశ్‌ కీలక పాత్రలు పోషించారు. త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్‌ దండా నిర్మించారు. ఈ నెల 26న విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్‌,పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా, ఈ సినిమాలో ‘రావులమ్మ’ పాట చిత్రీకరణను లైవ్‌గా చూపించారు. తెలుగులో ఒక సినిమా షూటింగ్‌ను లైవ్‌లో అందించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాతో పెద్ద హిట్‌ కొట్టబోతున్నాం. సినిమా కచ్చితంగా అందరికీ విందు భోజనంలా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘మజాకా’లో ఇది సెకండ్‌ మాస్‌ సాంగ్‌. హీరో సందీప్‌ కిషన్‌, హీరోయిన్‌ రీతూ వర్మ ఇరగదీశారు. సాంగ్‌ అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చింది. ఈ పాటతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి. బ్లాక్‌బస్టర్‌ కొట్టబోతున్నాం’’ అని దర్శకుడు త్రినాథరావు చెప్పారు. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది’’ అని నిర్మాత రాజేశ్‌ దండా అన్నారు. ‘‘ఇది థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయాల్సిన సినిమా’’ అని రీతూ వర్మ అన్నారు.


ఇవీ చదవండి:

ప్రాక్టీస్ మొదలుపెట్టిన క్రికెట్ గాడ్.. ఫ్యాన్స్‌కు పండగే

రోహిత్ తిరుగులేని వ్యూహం.. పక్కా స్కెచ్‌తో

ధోని నుంచి రోహిత్ ఎరా వరకు.. డాక్యుమెంటరీ చూశారా..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 18 , 2025 | 01:12 AM