వాస్తవ ఘటనల ఆధారంగా
ABN , Publish Date - May 12 , 2025 | 05:02 AM
‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ దా ధమ్కీ’ సినిమాలతో దర్శకుడు, నిర్మాత, రచయితగా తన ప్రతిభను చాటారు విష్వక్సేన్. ఇప్పుడు ఆయన తన స్వీయ దర్శకత్వంలో తదుపరి ప్రాజెక్టు ‘కల్ట్’ కోసం...
‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ దా ధమ్కీ’ సినిమాలతో దర్శకుడు, నిర్మాత, రచయితగా తన ప్రతిభను చాటారు విష్వక్సేన్. ఇప్పుడు ఆయన తన స్వీయ దర్శకత్వంలో తదుపరి ప్రాజెక్టు ‘కల్ట్’ కోసం సిద్ధమవుతున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తారక్ సినిమాస్, వన్మయే క్రియేషన్స్ బ్యానర్లపై కరాటే రాజు, సందీప్ కాకర్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎస్.రాధాకృష్ణ(చిన్నబాబు) టైటిల్ లోగోను లాంచ్ చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముహూర్తపు షాట్‌కు కెమెరా స్విచ్ఛాన్ చేసారు. నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. ఈ సినిమాలో విష్వక్సేన్ నలభై మంది కొత్త నటులను పరిచయం చేస్తున్నారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తుండగా, రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, జపనీస్, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది.