తెలుగులోకి విజయ్ సేతుపతి ఏస్
ABN , Publish Date - May 18 , 2025 | 01:17 AM
విజయ్ సేతుపతి సినిమా అనగానే తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా ఆసక్తే. మంచి కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్ ఉంటాయని భావిస్తుంటారంతా...
విజయ్ సేతుపతి సినిమా అనగానే తమిళంలోనే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా ఆసక్తే. మంచి కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్ ఉంటాయని భావిస్తుంటారంతా. ఆయన తాజా చిత్రం ‘ఏస్’ ఇప్పుడు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం కోసం ప్రముఖ సంస్థలు పోటీ పడినా ఫ్యాన్సీ రేటు ఇచ్చి పద్మినీ సినిమాస్ సంస్థ అధినేత బి.శివప్రసాద్ హక్కులు సొంతం చేసుకున్నారు. ఈ నెల 23న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.