అన్ని హంగులతో అలరిస్తుంది

ABN , Publish Date - May 23 , 2025 | 03:49 AM

విజయ్‌ సేతుపతి, రుక్మిణి వసంత్‌ జంటగా దర్శకనిర్మాత అరుముగ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఏస్‌’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో శ్రీ పద్మిని సినిమాస్‌ బ్యానర్‌పై...

విజయ్‌ సేతుపతి, రుక్మిణి వసంత్‌ జంటగా దర్శకనిర్మాత అరుముగ కుమార్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఏస్‌’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో శ్రీ పద్మిని సినిమాస్‌ బ్యానర్‌పై బి. శివప్రసాద్‌ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ ‘నాకు మొదట అవకాశం ఇచ్చిన అరుముగ కుమార్‌తో మళ్లీ సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. ఇందులో యాక్షన్‌, రొమాన్స్‌ వంటి అన్ని వాణిజ్య హంగులు ఉన్నాయి. అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు. నిర్మాత బి. శివప్రసాద్‌ మాట్లాడుతూ ‘అందరి ముఖాల్లో సంతోషం చూస్తుంటే విడుదలకు ముందే ఈ సినిమా హిట్‌ అయినట్టు కనిపిస్తోంది. విజయ్‌తో ‘రొమాంటిక్‌ డాన్‌’ అనే సినిమాను త్వరలోనే ప్రకటిస్తాను’ అని అన్నారు. ‘ఈ చిత్రం విందు భోజనంలా ఉంటుంది. విజయ్‌ సేతుపతి ఆల్‌ రౌండర్‌. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది’ అని చిత్ర దర్శకనిర్మాత అరుముగ కుమార్‌ అన్నారు.

Updated Date - May 23 , 2025 | 03:49 AM