బోల్డ్‌ కాశీ పోరాటం

ABN , Publish Date - May 20 , 2025 | 04:31 AM

తమిళ హీరో విజయ్‌ సేతుపతి నటించిన చిత్రం ‘ఏస్‌’. అరుముగ కుమార్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రుక్మిణీ వసంత్‌ కథానాయిక. ఈ నెల 23న సినిమా తమిళ్‌లో, తెలుగులో...

తమిళ హీరో విజయ్‌ సేతుపతి నటించిన చిత్రం ‘ఏస్‌’. అరుముగ కుమార్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. రుక్మిణీ వసంత్‌ కథానాయిక. ఈ నెల 23న సినిమా తమిళ్‌లో, తెలుగులో విడుదలవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని పద్మినీ సినిమాస్‌ బ్యానర్‌పై బి.శివప్రసాద్‌ విడుదల చేయనున్నారు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో బోల్డ్‌ కాశీగా కనిపించనున్నారు విజయ్‌. ఆయన దేనికోసం పోరాటం చేస్తున్నాడు అనేది ఆసక్తికరంగా ఉండబోతోంది. అదరగొట్టే యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు, విజువల్స్‌, సంగీతం సినిమాకు ప్రధానార్షణగా నిలవనున్నాయి.

Updated Date - May 20 , 2025 | 04:31 AM