పరోటా మాస్టర్‌గా విజయ్ సేతుపతి
ABN , Publish Date - May 05 , 2025 | 05:06 AM
విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం టైటిల్‌ను ‘తలైవా తలైవి’ అని మేకర్స్ ఖరారు చేశారు. దీనిని ప్రకటిస్తూ తాజాగా టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో...
విజయ్ సేతుపతి, నిత్యా మేనన్ జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం టైటిల్‌ను ‘తలైవా తలైవి’ అని మేకర్స్ ఖరారు చేశారు. దీనిని ప్రకటిస్తూ తాజాగా టైటిల్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ సేతుపతి పరోటా మాస్టర్‌గా నటిస్తున్నారు. అందుకోసం ఆయన కొంత శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలిసింది. టీజర్‌లో..విజయ్ సేతుపతి, నిత్యామేనన్ వంట చేస్తూనే గొడవపడుతూ ఉంటారు. వారిద్దరు సరదాగా పోట్లాడుకుంటూ భార్యాభర్తలుగా కనిపిస్తారు. ఒకరిపై మరొకరు పెద్దగా అరుచుకుంటారు. చివరికి విజయ్ సేతుపతి నోటికి టవల్ కట్టుకొని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండిపోతాడు. కాగా, ఈ చిత్రంలో టబు లీడ్ రోల్‌లో నటించనున్నారు. నటి రాధికా ఆప్టే కూడా త్వరలో ఈ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు సమచారం. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.