కొత్త తేదీన కింగ్‌డమ్‌

ABN, Publish Date - May 15 , 2025 | 03:02 AM

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘కింగ్‌డమ్‌’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య...

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘కింగ్‌డమ్‌’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్ఠాత్మకంగా నిర్మించాయి. తొలుత ప్రకటించిన విధంగా ఈ నెల 30న ఈ చిత్రం విడుదలవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడు తేదీ మారింది. జూలై 4న కింగ్‌డమ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్‌ బుధవారం ప్రకటించారు. ఇటీవల దేశంలో జరిగిన ఊహించని సంఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించారు. సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌, ఎడిటర్‌: నవీన్‌ నూలీ, సినిమాటోగ్రఫీ: జోమోన్‌ టీ జాన్‌, గిరీశ్‌ గంగాధరన్‌.

Updated Date - May 15 , 2025 | 03:02 AM