Vijay Deverakonda New Movie: పవర్‌ఫుల్ లుక్
ABN , Publish Date - May 10 , 2025 | 06:32 AM
విజయ్ దేవరకొండ నటిస్తున్న రెండు కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లు విడుదలయ్యాయి. ఒకటి రూరల్ యాక్షన్ డ్రామా కాగా, మరొకటి బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందుతోంది.
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ‘ఎస్‌వీసీ 59’ వర్కింగ్ టైటిల్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. శుక్రవారం విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం కొత్త పోస్టర్‌ను పంచుకుంది. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రమిది.
ధ్యానముద్రలో...
అలాగే రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మరో చిత్రం రూపుదిద్దుకుంటోంది. ‘వీడీ 14’ వర్కింగ్ టైటిల్. రష్మిక మందన్న కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ నిర్మిస్తున్నాయి. బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ధ్యానముద్రలో ఉన్న విజయ్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. త్వరలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు.