ఎవరినీ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు

ABN, Publish Date - May 04 , 2025 | 03:09 AM

ఇటీవల నిర్వహించిన ‘రెట్రో’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన...

ఇటీవల నిర్వహించిన ‘రెట్రో’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన విజయ్‌ ఎవరినీ బాధ పెట్టడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. ‘నా మాటలు కొందరిని బాధపెట్టాయనే విషయం నా దృష్టికి వచ్చింది. ట్రైబ్‌ అని నేను వాడిన పదం వెనుక ఉద్దేశం భూమ్మీద తొలినాళ్లలో మనమంతా తెగలుగా, జాతులుగా ఉన్నామని చెప్పడమే. కానీ ఎవరినీ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ అంటే నాకు ఎంతో గౌరవం, ప్రేమ. మన సమాజంలో ఐక్యత ఉండాలి. ఒక్కటిగా మనమంతా ముందుకు వెళ్లాలనే చెప్పాను. దేశమంతా ఒక్కటిగా నిలబడాలని మాట్లాడాను. నా మాటలతో ఎవరైనా మనస్థాపం చెంది ఉంటే చింతిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

Updated Date - May 04 , 2025 | 03:09 AM