Vichitra: అమ్మ సెంటిమెంట్  ‘విచిత్ర’  

ABN , Publish Date - Nov 23 , 2025 | 05:18 PM

రవి, శ్రియ తివారి జంటగా సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వం రూపొందుతున్న చిత్రం ‘విచిత్ర’.  సెన్సర్ పనులు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది

రవి, శ్రియ తివారి జంటగా సిస్ ఫిలిమ్స్ బ్యానర్ పై సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వం రూపొందుతున్న చిత్రం ‘విచిత్ర’(Vichitra).  సెన్సర్ పనులు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది ఈ సినిమా. ఈ సందర్బంగా దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్  మాట్లాడుతూ

vi.jpeg

'ఆత్మీయమైన అమ్మ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందిన సినిమా ఇది. ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచించేలా చేసే హృదయాన్ని తాకే కథ ఇది. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని త్వరలోనే  విచిత్ర మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం  హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్ర వేస్తుందనే ఆశాభావం ఉంది' అని తెలిపారు. జ్యోతి అపూర్వ, 'బేబీ' శ్రీ హర్షిణి యసిక, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రలుగా నటించారు . 

Updated Date - Nov 23 , 2025 | 07:47 PM