Rajesh: తమిళ నటుడు రాజేశ్‌ మృతి

ABN , Publish Date - May 30 , 2025 | 05:34 AM

సీనియర్‌ తమిళ నటుడు రాజేశ్‌ (75) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని గురువారం ఉదయం చెన్నై నందంబాక్కంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళుతుండగా...

Rajesh

సీనియర్‌ తమిళ నటుడు రాజేశ్‌ (75) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ని గురువారం ఉదయం చెన్నై నందంబాక్కంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళుతుండగా, మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య గతంలోనే మృతి చెందారు. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్న రాజేశ్‌ తమిళనాడు ప్రభుత్వ డాక్టర్‌ ఎంజీఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. కె.బాలచందర్‌ దర్శకత్వంలో తొలిసారి సినీ అవకాశాన్ని పొంది, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో 150కి పైగా చిత్రాల్లో నటించారు.

ఆంధ్రజ్యోతి, (చెన్నై)

Updated Date - May 30 , 2025 | 06:05 AM