నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది

ABN , Publish Date - May 11 , 2025 | 03:40 AM

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్యనటుడిగా ప్రేక్షకులను మెప్పించడం సవాల్‌. రకరకాల వేదికలపై కామెడీ కంటెంట్‌ విస్తృతంగా అందుబాటులో ఉంది. అంతకు మించిన కంటెంట్‌ ఇస్తేనే ప్రేక్షకలను థియేటర్‌కు..

నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో హాస్యనటుడిగా ప్రేక్షకులను మెప్పించడం సవాల్‌. రకరకాల వేదికలపై కామెడీ కంటెంట్‌ విస్తృతంగా అందుబాటులో ఉంది. అంతకు మించిన కంటెంట్‌ ఇస్తేనే ప్రేక్షకలను థియేటర్‌కు తీసుకురావడం సాధ్యమవుతుంది’ అని వెన్నెల కిశోర్‌ అన్నారు. శ్రీవిష్ణు కథానాయకుడిగా కార్తీక్‌ రాజు దర్శకత్వం వహించిన ‘సింగిల్‌’ చిత్రంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం చక్కటి ప్రేక్షకాదరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా వెన్నెల కిశోర్‌ మీడియాతో ముచ్చటించారు.

‘ఈ చిత్రంలో నా నటనకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనకు ఆనందంగా ఉంది. నటుడిగా నా ప్రతిభ వల్ల ఒక సినిమా మరింతగా ప్రేక్షకులకు చేరువవడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. చాలా సార్లు మనకు సాదాసీదా పాత్రలే వస్తుంటాయి. అందులో ఉండే ప్రత్యేకతను అవగాహన చేసుకొని మనదైన ముద్రను చూపేందుకు ప్రయత్నించాలి. గీతగోవిందం, అమీతుమీ పాత్రలు నటుడిగా సంతృప్తిని ఇచ్చాయి. ఇప్పుడు ‘సింగిల్‌’ చిత్రంలో అరవింద్‌ పాత్ర నా కెరీర్‌లో గుర్తుండిపోతుంది.’

Updated Date - May 11 , 2025 | 03:40 AM