సినిమా మామూలుగా ఉండదు

ABN , Publish Date - Jan 07 , 2025 | 06:56 AM

వెంకటేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. ఈ నెల 14న విడుదలవుతోంది. సోమవారం సినిమా ట్రైలర్‌ను మహేశ్‌బాబు...

వెంకటేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మించారు. ఈ నెల 14న విడుదలవుతోంది. సోమవారం సినిమా ట్రైలర్‌ను మహేశ్‌బాబు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. నిజామాబాద్‌ కలెక్టర్‌ గ్రౌండ్స్‌లో జరిగిన వేడుకలో వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘‘మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. ఇప్పటివరకూ నాకు ‘బొబ్బిలిరాజా’, ‘చంటి’, ‘గణేశ్‌’, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ ఇలా ఎన్నో విజయాలు ఇచ్చారు. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఇది పక్కా సంక్రాంతి సినిమా. వినోదాత్మకంగా ఉంటుంది. ఈ సినిమాతో పాటు ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘డాకు మహారాజ్‌’ కూడా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను. దిల్‌రాజు నిర్మాణంలో చేసిన నాలుగు సినిమాలూ సూపర్‌ హిట్లు అయ్యాయి. వారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. అనిల్‌ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. పెళ్ళాలకి మీ ఫ్లాష్‌బ్యాకులు చెప్పొద్దు. సినిమా చూడండి. మామూలుగా ఉండదు’’ అని అన్నారు. నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ ‘‘వెంకటేశ్‌, అనిల్‌, శిరీష్‌ ఈ సినిమాను ఓ బాధ్యతగా తీసుకుని 72 రోజుల్లోనే పూర్తి చేశారు. ఓ సినిమా వేడుక పూర్తిస్థాయిలో నిజామాబాద్‌లో జరగడం ఇదే ప్రథమం. శిరీష్‌కూ, నాకూ సినిమాలపై ఇష్టం ఏర్పడింది ఇక్కడే. ఈ సంక్రాంతి మా సంస్థకు బ్లాక్‌బస్టర్‌ పొంగల్‌గా మారుతుంది’’ అని చెప్పారు. ‘‘నేను వేదికపై ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఈ సినిమా కచ్చితంగా అందరినీ అలరిస్తుంది. ఈ సినిమాలో భాగమైన అందరికీ ధన్యవాదాలు’’ అని నిర్మాత శిరీష్‌ తెలిపారు. ‘‘మీరు ట్రైలర్‌లో చూసింది కొంతే. సినిమాలో చాలా చాలా ఉంది. ఇది టిపికల్‌ జోనర్‌ సినిమా. వెంకటేశ్‌ అద్భుతంగా నటించారు. సినిమాలో చాలా ఆసక్తికరమైన మలుపులు ఉంటాయి పండక్కి పెద్ద హిట్‌ కొట్టబోతున్నాం. ఈ సినిమాలో వెంకటేశ్‌ పోషించిన పాత్ర.. ఆయన కెరీర్‌లోనే భిన్నమైనది’’ అని అన్నారు.

నిజామాబాద్‌ కల్చరల్‌, ఆంధ్రజ్యోతి


111-Cj.jpg

టికెట్‌ ధరల పెంపుపై సీఎంను కలుస్తా : దిల్‌ రాజు

తెలంగాణలో ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా టికెట్‌ ధరల పెంపుపై సీఎం రేవంత్‌రెడ్డిని కలసి విజ్ఞప్తి చేస్తానని ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఎ్‌ఫడీసీ) చైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రానికి తెలంగాణలో కూడా టికెట్‌ ధరలు పెంచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని, ఈ విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టికెట్‌ రేట్లు పెంచడం వల్ల ప్రభుత్వానికి 18 శాతం ట్యాక్స్‌ రూపంలో ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ‘గేమ్‌ ఛేంజర్‌’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ తనకు కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్స్‌ అని నమ్ముతున్నట్లు దిల్‌రాజు చెప్పారు.

Updated Date - Jan 07 , 2025 | 06:56 AM