వీరమల్లు వస్తున్నాడు

ABN, Publish Date - May 07 , 2025 | 01:46 AM

పవన్‌ కల్యాణ్‌ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ తొలి భాగం షూటింగ్‌ మంగళవారంతో పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ నిర్మాత ఏ.ఎం.రత్నం ఆనందం వ్యక్తం చేశారు...

పవన్‌ కల్యాణ్‌ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ తొలి భాగం షూటింగ్‌ మంగళవారంతో పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ నిర్మాత ఏ.ఎం.రత్నం ఆనందం వ్యక్తం చేశారు. ‘చిత్రీకరణ పూర్తయింది. ఇక థియేటర్లలో విడుదల కావడమే తరువాయి. బ్లాక్‌బస్టర్‌ సాంగ్స్‌, అదిరిపోయే ట్రైలర్‌ త్వరలో విడుదలవుతాయి’ అని ఏ.ఎం.రత్నం తెలిపారు. ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ చారిత్రక యోధుడిగా నటిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. బాబీ డియోల్‌, అనుపమఖేర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్‌ ప్రకటించారు. అయితే కొంత షూటింగ్‌ మిగిలి ఉండడంతో వాయిదా పడింది. ఇప్పుడు మొత్తం చిత్రీకరణ పూర్తయినందున విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

Updated Date - May 07 , 2025 | 01:46 AM