మెగా ఫ్యామిలీలో మరో ఆనందం
ABN, Publish Date - May 07 , 2025 | 01:39 AM
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి దంపతులు శుభవార్త చెప్పారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్దరు చేతులు పట్టుకొని చిన్నపిల్లల షూతో ఉన్న ఫొటోను షేర్ చేసారు...
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి దంపతులు శుభవార్త చెప్పారు. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్దరు చేతులు పట్టుకొని చిన్నపిల్లల షూతో ఉన్న ఫొటోను షేర్ చేసారు. ‘జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించనున్నాను. కమింగ్ సూన్’ అని వరుణ్ తేజ్ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది. పలువురు సినీ ప్రముఖులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, అల్లు స్నేహ తదితరులు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెట్టారు. కాగా, 2017లో విడుదలైన ‘మిస్టర్’ సినిమాలో వరుణ్ - లావణ్య తొలిసారి కలసి నటించారు.