కేన్స్‌లో మెరిసిన ఊర్వశి డ్రెస్‌పై విమర్శలు

ABN , Publish Date - May 15 , 2025 | 02:56 AM

కేన్స్‌ 78వ చిత్రోత్సవం ఇటీవలె అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో మొదటిరోజున ప్రధానాకర్షణగా నిలిచారు ఊర్వశీ రౌతేలా. రంగురంగుల గౌనును ధరించడంతో పాటు చిలుక ఆకారంలో ఉండే ఓ...

కేన్స్‌ 78వ చిత్రోత్సవం ఇటీవలె అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో మొదటిరోజున ప్రధానాకర్షణగా నిలిచారు ఊర్వశీ రౌతేలా. రంగురంగుల గౌనును ధరించడంతో పాటు చిలుక ఆకారంలో ఉండే ఓ ఆకర్షణీయమైన బ్యాగుతో రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారామె. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. లుక్‌ బాగుందంటూ కొందరు ఊర్వశిని ఆకాశానికెత్తేస్తుండగా, మరికొందరు ఆమెను కాపీ క్యాట్‌ అంటూ విమర్శిసున్నారు. దీనికి కారణం, 2018లో ఐశ్యర్యా రాయ్‌ ధరించిన గౌనూ.. ఊర్వశి ధరించిన డ్రెస్‌ ఒకేలా కనిపించడమే. ఈ ఏడాది జరిగే కేన్స్‌ వేడుకల్లో భారత్‌ నుంచి ఐశ్వర్యారాయ్‌, జాన్వీ కపూర్‌, షర్మిలా ఠాగూర్‌ తదితరులు రెడ్‌ కార్పెట్‌పై హొయలొలికించనున్నారు. కాగా, ఈ నెల 24న విజేతలను ప్రకటిస్తారు.

Updated Date - May 15 , 2025 | 02:56 AM