సూర్యకుమార్‌గా ఉపేంద్ర

ABN , Publish Date - May 13 , 2025 | 02:57 AM

రామ్‌ పోతినేని కథానాయకుడిగా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ ఫేమ్‌ మహేశ్‌బాబు.పి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘రాపో 22’ (వర్కింగ్‌ టైటిల్‌). భాగ్యశ్రీ బోర్సే...

రామ్‌ పోతినేని కథానాయకుడిగా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’ ఫేమ్‌ మహేశ్‌బాబు.పి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘రాపో 22’ (వర్కింగ్‌ టైటిల్‌). భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రామ్‌, భాగ్యశ్రీ పాత్రలను పరిచయం చేశారు మేకర్స్‌. తాజాగా, ఇందులో కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడిస్తూ, ఆయన పాత్రను పరిచయం చేశారు. ఆయన ‘సూర్యకుమార్‌’ అనే స్టైలిష్‌ పాత్రను పోషించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 15న టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని, సంగీతం: వివేక్‌- మెర్విన్‌.

Updated Date - May 13 , 2025 | 02:57 AM