TSFCC: ఆ ప్రచారంలో నిజం లేదు

ABN, Publish Date - May 17 , 2025 | 01:08 AM

తెలంగాణ థియేటర్లలో సినిమాలను వాటాల పద్ధతిలో ప్రదర్శించాలన్న ప్రచారంలో వాస్తవం లేదని టీఎస్‌ఎఫ్‌సీసీ స్పష్టం చేసింది. అసలైన నిర్ణయాలు ఈనెల 18న జరగనున్న సమావేశం తర్వాత వెల్లడిస్తామని తెలిపింది.

  • టీఎస్ఎఫ్‌సీసీ

కపై అద్దె ప్రాతిపదికన కాకుండా వాటాల విధానంలోనే థియేటర్లలో సినిమాలను ప్రదర్శించాలని తెలంగాణ థియేటర్ల యజమానులు నిర్ణయించుకున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని టీఎస్‌ఎఫ్‌సీసీ (తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌) అధ్యక్షుడు సునీల్‌ నారంగ్‌, కార్యదర్శి కే అనుపమ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కొన్ని మీడియా సంస్థలతో పాటు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం ఈనెల 18న జరగనుందనీ, అప్పుడే ఎగ్జిబిటర్ల సమస్యలతో పాటు ప్రభుత్వాల విధానాలపైనా చర్చించి, ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తామని చెప్పారు.

Updated Date - May 17 , 2025 | 01:10 AM