సిరివెన్నెల పాటలను బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా
ABN, Publish Date - May 20 , 2025 | 04:42 AM
దివంగత గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని దర్శకుడు త్రివిక్రమ్ ఎంతలా ఆదరిస్తారో అందరికీ తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా తనకు ఆయనపై ఉన్న ప్రేమను చాటుకుంటుంటారు త్రివిక్రమ్...
దివంగత గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిని దర్శకుడు త్రివిక్రమ్ ఎంతలా ఆదరిస్తారో అందరికీ తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా తనకు ఆయనపై ఉన్న ప్రేమను చాటుకుంటుంటారు త్రివిక్రమ్. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సీతారామశాస్త్రి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘‘తాను రాసిన పాటలు కలకాలం నిలిచిపోవాలనే తపనతో ఆయన పాటలు రాసేవారు. ఆయన రాసిన పాటలకు కాలంతో సంబంధం లేకుండా ఇప్పటికీ ఆదరణ దక్కుతోంది. ‘జల్సా’ సినిమాలో ‘ఛలోరే ఛలోరే’ పాటను 34 పేజీల్లో రాశారు. కానీ సినిమాలో రెండు పేజీలు కూడా వాడలేదు. నిజానికి మాటలు రాయడం కంటే పాటలు రాయడం చాలా కష్టం. నేను ఆరు పాటలు రాశాను. తెలియకుండానే మొదటి పాటలోని పదాలు ఆరో పాటలో రిపీట్ అయ్యాయి. కొన్ని వేల పాటలు రాశారాయన. అందులో రెండు, మూడు వేల పాటలను సినిమాల్లో వాడనేలేదు. వాటిని ఎలా బయటకి తీసుకురావాలా అని ప్రయత్నిస్తున్నాను. అవి బయటకొస్తే.. రాబోయే తరం గీత రచయితలకు ఎంతగానో ఉపయోగపడతాయి’’ అని పేర్కొన్నారు.