అద్భుతమైన అనుభూతినిచ్చేలా...
ABN , Publish Date - Mar 20 , 2025 | 02:29 AM
హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి, సాన్వీ మేఘన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం‘టుక్ టుక్. సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో రాహుల్ రెడ్డి..
హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి, సాన్వీ మేఘన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టుక్ టుక్’. సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోన్న సందర్భంగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుడు సుప్రీత్ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినిచ్చేలా సరికొత్తగా ఉంటుందీ సినిమా. అందరి మనసులు గెలుచుకుంటుంది’’ అని అన్నారు. ‘‘సినిమా తప్పక విజయం సాధిస్తుంది’’ అని నిర్మాత రాహుల్ రెడ్డి చెప్పారు.