ఆడపులి అరాచకం
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:53 AM
‘రాచకొండ ఒక అడవి లాంటిదబ్బా.. ఈడ బలంతో పోరాడే పులులు, బలగంతో పోరాడే ఏనుగులు, ఎత్తుకు పై ఎత్తు వేసే గుంటనక్కలు, కాసుకుని కాటేసే విష సర్పాలు...
‘రాచకొండ ఒక అడవి లాంటిదబ్బా.. ఈడ బలంతో పోరాడే పులులు, బలగంతో పోరాడే ఏనుగులు, ఎత్తుకు పై ఎత్తు వేసే గుంటనక్కలు, కాసుకుని కాటేసే విష సర్పాలు ఉంటాయి. వాటి మధ్య జరిగే పోరులో రక్త పాతాలే తప్ప రక్త సంబంధాలు ఉండవు’ అంటూ సాగింది ‘రాచరికం’ చిత్రం ట్రైలర్. అప్సరా రాణి, విజయ్‌శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. విలేజ పొలిటికల్ రివెంజ్ డ్రామా ఇదని దర్శకద్వయం సురేశ్ లంకపల్లి, ఈశ్వర్ వాసే చెప్పారు. ఈశ్వర్ ఈ చిత్రానికి నిర్మాత.