రికార్డు స్థాయిలో

ABN , Publish Date - May 14 , 2025 | 05:51 AM

కమల్‌హాసన్‌ హీరోగా మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. 38 ఏళ్ల తర్వాత కమల్‌, మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే...

కమల్‌హాసన్‌ హీరోగా మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. 38 ఏళ్ల తర్వాత కమల్‌, మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ప్రమోషన్‌ కార్యక్రమాలను చిత్రబృందం వేగవంతం చేస్తూ భారీ హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ రికార్డు స్థాయిలో జరిగినట్లు కోలీవుడ్‌ కథనాలు తెలియజేస్తున్నాయి. ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సంస్థ నూట యాభై కోట్ల రూపాయలతో, అలాగే ఓ తమిళ్‌ స్టార్‌ హీరోకు చెందిన టెలివిజన్‌ సంస్థ శాటిలైట్‌ రైట్స్‌ కోసం అరవై కోట్ల రూపాయలతో డీల్‌ కుదుర్చుకున్నట్లు కోలీవుడ్‌ మీడియా పేర్కొంది. కాగా, ఈ చిత్రం జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో త్రిష కథానాయికగా నటించారు. శింబు, అభిరామి, జోజు జార్జ్‌ కీలక పాత్రలు పోషించారు. ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated Date - May 14 , 2025 | 05:51 AM