Kamal Haasan: వేడుక వాయిదా
ABN , Publish Date - May 10 , 2025 | 06:43 AM
కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘థగ్ లైఫ్’ చిత్రానికి జూన్ 5న విడుదల తేదీ ఖరారు కాగా, ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఈనెల 16న జరపాలనుకున్న చిత్రబృందం, దేశంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఈ వేడుకను వాయిదా వేసింది.
కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న పాన్ ఇండియా చిత్రం ‘థగ్ లైఫ్’. జూన్ 5న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈనెల 16న ఆడియో లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించాలని చిత్రబృందం భావించింది. అయితే, ప్రస్తుతం దేశ సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో వేడకను వాయిదా వేసినట్టు చిత్రబృందం తెలిపింది. ఈ మేరకు కమల్‌హాసన్ ‘ఆర్ట్ కెన్ వెయిట్ - ఇండియా కమ్స్ ఫస్ట్’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.