ఇది సినిమా కాదు జీవితం
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:54 AM
రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేశ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేశ్ చౌదరి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా గ్లింప్స్‌ను...
రాజేంద్రప్రసాద్, అర్చన, రూపేశ్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేశ్ చౌదరి నిర్మిస్తున్నారు. బుధవారం ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఇది సినిమా కాదు జీవితం. ఈ ప్రాజెక్ట్‌కు పనిచేసిన వారందరూ గర్వపడేలా ఉంటుందీ చిత్రం. మన కుటుంబంలోని వారంతా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్పే చిత్రమిది’’ అని అన్నారు. అర్చన మాట్లాడుతూ ‘‘‘లేడీస్ టైలర్ వచ్చిన 38 ఏళ్లకు తిరిగి రాజేంద్రప్రసాద్‌తో పనిచేస్తుండడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ ‘‘మంచి విలువలున్న చిత్రమిది. కలకాలం ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతుంది’’ అని తెలిపారు.