విభిన్న కోణాలను స్పృశిస్తుంది
ABN , Publish Date - Mar 13 , 2025 | 03:52 AM
నూతన దర్శకుడు రామ్‌జగదీష్ తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్’. ప్రియదర్శి కథానాయకుడిగా నటించారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు..
నూతన దర్శకుడు రామ్‌జగదీష్ తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్’. ప్రియదర్శి కథానాయకుడిగా నటించారు. హీరో నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు రామ్ మీడియాతో ముచ్చటించారు.
‘‘నా జీవితంలో చూసిన ఓ కేసు తాలూకూ విషయాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆ ఇతివృత్తంతో సినిమా చేస్తే బాగుంటుందనిపించింది. అలా, వాస్తవ సంఘటనలకు కొంత కల్పన జోడించి ఈ సినిమా కథను తయారుచేశాను. పోక్సో యాక్ట్ నేపథ్యంలో ఉంటుంది. నానికి ఈ కథను చెప్పడం కోసం ఎనిమిది నెలలు ఎదురుచూశాను. ఆయన సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశారు. ఇది లవ్ స్టోరీతో కూడిన కోర్ట్ రూమ్ డ్రామా. ఇందులో ప్రియదర్శి పోషించిన లాయర్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. ఆయన కెరీర్‌లో గొప్ప పాత్రగా నిలిచిపోతుంది. రోషన్, శ్రీదేవి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా మన జీవితాల్లోని పలు కోణాల్ని టచ్ చేస్తుంది. ఫైనల్ అవుట్‌పుట్ చూసిన నాని సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు’’ అని చెప్పారు.