తమ్ముడి మూడ్
ABN, Publish Date - May 14 , 2025 | 05:42 AM
నితిన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 4న విడుదలవుతోంది. తాజాగా, ఈ సినిమాలోని కీలక పాత్రలను, వారి పేర్లను పరిచయం చేస్తూ...
నితిన్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 4న విడుదలవుతోంది. తాజాగా, ఈ సినిమాలోని కీలక పాత్రలను, వారి పేర్లను పరిచయం చేస్తూ ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అనే వీడియోను విడుదల చేశారు మేకర్స్. అగర్వాల్‌గా సౌరభ్ సచ్‌దేవ్, రత్నగా సప్తమి గౌడ, ఝాన్సీ కిరణ్మయిగా లయ, చిత్రగా వర్ష బొల్లమ్మ నటిస్తున్నారు. భారతీయ జెర్సీ వేసుకున్న నితిన్.. బాణాన్ని లక్ష్యానికి గురిపెడుతూ ఉన్న విజువల్స్ చూస్తుంటే ఇందులో ఆయన విలువిద్య క్రీడాకారుడి పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వీడియోలో వీరిని పరిచయం చేసిన విధానం ఆసక్తికరంగా ఉండి, సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రానికి ఎడిటర్: ప్రవీణ్ పూడి, డీఓపీ: కేవీ గుహన్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్.