తెరచాప సందేశం
ABN, Publish Date - May 07 , 2025 | 01:32 AM
నూతన నటీనటులతో తెరకెక్కుతోన్న సందేశాత్మక చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో కైలాశ్ దుర్గం నిర్మిస్తున్నారు. నవీన్ రాజు, పూజ సుహాసిని జంటగా నటిస్తున్నారు...
నూతన నటీనటులతో తెరకెక్కుతోన్న సందేశాత్మక చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వంలో కైలాశ్ దుర్గం నిర్మిస్తున్నారు. నవీన్ రాజు, పూజ సుహాసిని జంటగా నటిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ప్రేక్షకులను మెప్పించేలా ‘తెరచాప’ చిత్రాన్ని తీశాను. కథానుసారం తమిళనాడు నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయి’ అని చెప్పారు. ‘ఈ సినిమా నాకు నిర్మాతగా తొలి చిత్రమే అయినా కథపైన గట్టి నమ్మకంతో నిర్మించాను. ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి’ అని కైలాశ్ దుర్గం తెలిపారు.