తెలుగువాడినని వద్దన్నారు

ABN, Publish Date - May 05 , 2025 | 05:14 AM

ఇటీవలె విడుదలైన హిందీ చిత్రం ‘జాట్‌’తో హిట్‌ కొట్టారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. దాదాపు వంద కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించిన ఆ చిత్రానికి సీక్వెల్‌నూ ప్రకటించారు. తాజాగా మీడియాకు...

ఇటీవలె విడుదలైన హిందీ చిత్రం ‘జాట్‌’తో హిట్‌ కొట్టారు దర్శకుడు గోపీచంద్‌ మలినేని. దాదాపు వంద కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించిన ఆ చిత్రానికి సీక్వెల్‌నూ ప్రకటించారు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడిగా తనకు ఓ ప్రాజెక్ట్‌ విషయంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు గోపీచంద్‌. ‘‘బాలకృష్ణతో ‘వీరసింహా రెడ్డి’ సినిమా చేశాక, తదుపరి ప్రాజెక్ట్‌ కోసం తమిళ హీరో విజయ్‌కు కథ చెప్పా. సింగిల్‌ సిట్టింగ్‌లోనే ఆయన ఆ కథను ఓకే చేశారు. ఆ సమయంలోనే విజయ్‌ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే ఆయన ఓ తెలుగు డైరెక్టర్‌తో ‘వారీసు’ (వారసుడు) చేశారు. మరో సినిమాను తెలుగువాడితో కాకుండా తమిళ దర్శకుడితోనే చేయమని ఆయనకు తమిళుల నుంచి ఒత్తిడి వచ్చింది అని అనుకుంటున్నాను. దాంతో ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం బాలకృష్ణతో ఓ సినిమాను తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు గోపీచంద్‌ మలినేని.

Updated Date - May 05 , 2025 | 05:14 AM