శక్తిమంతమైన యోధుడు

ABN , Publish Date - May 21 , 2025 | 01:32 AM

తేజ సజ్జా హీరోగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘మిరాయ్‌’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు....

తేజ సజ్జా హీరోగా కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘మిరాయ్‌’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తేజ సజ్జా సూపర్‌ యోధగా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్‌ అయ్యారు. అలాగే మంచు మనోజ్‌ విలన్‌గా, రీతికా నాయక్‌ కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ ముంబైలోని చారిత్రక గుహల్లో ప్రారంభమైంది. తేజతో పాటు కొన్ని ప్రధాన నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టులో ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది భాషల్లో విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన తేజ సజ్జా, మంచు మనోజ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు, స్పెషల్‌ గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

Updated Date - May 21 , 2025 | 01:32 AM