క్రిమినల్ కథేంటి?
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:44 AM
క్రైమ్, అపరాధపరిశోధనాత్మక కథనంతో రూపొందిన తమిళ చిత్రం ‘రాకాదన్’. వంశీకృష్ణ, రియాజ్‌ఖాన్, దినేశ్ ప్రధాన తారాగణం. దినేశ్ కలై దర్శకుడు....
క్రైమ్, అపరాధపరిశోధనాత్మక కథనంతో రూపొందిన తమిళ చిత్రం ‘రాకాదన్’. వంశీకృష్ణ, రియాజ్‌ఖాన్, దినేశ్ ప్రధాన తారాగణం. దినేశ్ కలై దర్శకుడు. కే హైమావతి నిర్మించారు. ఇప్పుడు ఈ చిత్రం ‘క్రిమినల్ 123’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కేజేఆర్ పిక్చర్స్ పతాకంపై రామకృష్ణ, కిశోర్, జయబాబు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. మే తొలివారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఆదివారం తెలిపారు. వాణిజ్య అంశాలకి, సామాజిక అంశాలను కలిపి తెరకెక్కించిన చిత్రమిదని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి ఏ ప్రవీణ్ కుమార్ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: మాన్‌సబాబు.