ప్రచారకర్తగా తమన్నా
ABN , Publish Date - May 23 , 2025 | 04:01 AM
కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ ‘కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్’ ఉత్పత్తులైన ‘మైసూరు శాండల్ సోప్’ బ్రాండ్‌కు ప్రముఖ కథానాయిక తమన్నా...
కన్నడ సంఘాల ఆగ్రహం
కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ ‘కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్’ ఉత్పత్తులైన ‘మైసూరు శాండల్ సోప్’ బ్రాండ్‌కు ప్రముఖ కథానాయిక తమన్నా భాటియాను ప్రచారకర్తగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ళపాటు ప్రచారకర్తగా నియమించుకునేందుకుగాను రూ.6.20 కోట్లు చెల్లించేందుకు ఆమెతో ఒప్పందం చేసుకొంది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని పలు కన్నడ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సంస్థకు కన్నడ నటులను కాకుండా ఒక పరభాషా నటిని ప్రచారకర్తగా ఎలా నియమిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.