ప్రేక్షకులను మెప్పించే కథతో

ABN , Publish Date - May 02 , 2025 | 01:56 AM

‘దక్ష, మిస్టరీ, ఎందరో మహానుభావులు’ లాంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు తల్లాడ సాయికృష్ణ. ఆయన దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని....

‘దక్ష, మిస్టరీ, ఎందరో మహానుభావులు’ లాంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు తల్లాడ సాయికృష్ణ. ఆయన దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కుతోంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్‌ ప్రకటించింది. తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ ‘నిత్యజీవితంలో తారసిల్లే జీవితాల్ని, వాటి తాలూకు భావోద్వేగాల్ని ఆవిష్కరిస్తుందీ సినిమా. ప్రేక్షకులు కోరుకుంటున్న అంశాలతో కథను సిద్ధం చేసేందుకు చాలా సమయం పట్టింది. అగ్రతారలతో ఈ సినిమా ఉండబోతోంది’ అని చెప్పారు.

Updated Date - May 02 , 2025 | 01:56 AM