మరింత వినోదంతో...
ABN , Publish Date - May 05 , 2025 | 05:04 AM
హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవలె విడుదలైన ‘ఫిర్ ఆయీ హసీనా దిల్‌రూబా’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2021లో విక్రాంత్ మస్సే, తాప్సీ జంటగా...
హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవలె విడుదలైన ‘ఫిర్ ఆయీ హసీనా దిల్‌రూబా’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2021లో విక్రాంత్ మస్సే, తాప్సీ జంటగా వినీల్ మాథ్యూ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హసీనా దిల్‌రూబా’కు ఇది సీక్వెల్. ఇవి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాయి. ఇప్పుడు ఈ చిత్రానికి మూడో భాగం కూడా రాబోతోందని హింట్ ఇచ్చారు రచయిత్రి కనిఖా థిల్లాన్. ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయని.. మొదటి రెండు భాగాల కంటే మూడో భాగం మరింత వినోదంతో అలరించేలా ఉండబోతోందని తెలిపారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ గురించి మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ప్రస్తుతం ‘గాంధారీ’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నారు తాప్సీ పన్ను.