ప్రేక్షకుల ఆదరణ మరువలేనిది
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:20 AM
పలు కుటుంబ కథా చిత్రాలను రూపొందించి పరిశ్రమకు మర్చిపోలేని విజయాలను అందించిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. 32 ఏళ్ల కెరీర్‌లో 42 చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల మెప్పు పొందారు...
పలు కుటుంబ కథా చిత్రాలను రూపొందించి పరిశ్రమకు మర్చిపోలేని విజయాలను అందించిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. 32 ఏళ్ల కెరీర్‌లో 42 చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఆదివారం ఎస్వీ క ృష్ణారెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినిమాల్లో నటించిన నటీనటులు అంతా కలసి కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘నన్ను మొదట్నుంచి ప్రోత్సహిస్తూ, అండగా నిలుస్తున్న అచ్చిరెడ్డి గారికి రుణపడి ఉంటాను. అలాగే నా తొలి చిత్రంలో హీరోగా నటించేందుకు అంగీకరించిన రాజేంద్రప్రసాద్ గారిని ఎప్పటికీ మరువలేను. అలాగే ఇన్నేళ్లుగా ప్రేక్షకులు నా పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలను మరువలేను. వారికి ఽధన్యవాదాలు తెలుపుతున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, రోజా, ఆమని, ఇంద్రజ, లయ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు నటీనటులపై రాజేంద్రప్రసాద్ అసభ్య పదజాలం ఉపయోగించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.