సూర్య కొత్త సినిమా ఆరంభం
ABN , Publish Date - May 20 , 2025 | 04:46 AM
తెలుగునాట సూర్యకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘గజని’, ‘సింగం’, ‘యముడు’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు...
తెలుగునాట సూర్యకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘గజని’, ‘సింగం’, ‘యముడు’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు డబ్బింగ్ చిత్రాలతోనే అలరించిన సూర్య ఇప్పుడు నేరుగా తెలుగు చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రంలో సూర్య నటిస్తున్నారు. ఇది సూర్యకు 46వ చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో రవీనా టాండన్ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందించనున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మొత్తానికి తెలుగు సినిమా చేయాలన్న సూర్య కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది.