వేడుక. వినోదం
ABN , Publish Date - Jun 12 , 2025 | 06:09 AM
హీరో సూర్య నటిస్తున్న తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రం (సూర్య - 46) చిత్రం రెగ్యులర్ షూట్ బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. ‘వేడుక, భావోద్వేగం,..
హీరో సూర్య నటిస్తున్న తొలి తెలుగు స్ట్రెయిట్ చిత్రం (సూర్య - 46) చిత్రం రెగ్యులర్ షూట్ బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. ‘వేడుక, భావోద్వేగం, వినోదం వైపు తొలి అడుగు’ అంటూ సూర్య ముందడుగు వేస్తున్న పోస్టర్‌ను చిత్రబృందం పంచుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో మమితా బైజు కథానాయిక. రవీనాటాండన్, రాధికా శరత్‌కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. సంగీతం: జీవీ ప్రకాశ్, సినిమాటోగ్రఫీ: నిమిష్ రవి