నా కెరీర్‌లోనే ప్రత్యేకం
ABN , Publish Date - May 19 , 2025 | 03:26 AM
‘డియర్ ఉమ’ సినిమాతో తెరంగేట్రం చేశారు తెలుగమ్మాయి సుమయ రెడ్డి. ఈ సినిమాకు ఆమె నిర్మాతగానూ వ్యవహరించడం విశేషం. ఇందులో ఆమె పోషించిన డాక్టర్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి...
‘డియర్ ఉమ’ సినిమాతో తెరంగేట్రం చేశారు తెలుగమ్మాయి సుమయ రెడ్డి. ఈ సినిమాకు ఆమె నిర్మాతగానూ వ్యవహరించడం విశేషం. ఇందులో ఆమె పోషించిన డాక్టర్ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ’డియర్ ఉమ’ ఎంతో ప్రత్యేకమైంది. నటిగా నాకు మంచి బ్రేక్‌తో పాటు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు అందించిన ఆదరాభిమానాలు మరువలేనివి. ఈ ప్రోత్సాహంతో మరింత ముందుకు సాగుతాను’ అని చెప్పారు. త్వరలోనే ఆమె నటిస్తున్న కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించనున్నారు.